![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -79 లో.....గంగ మారు వేషంలో రుద్ర దగ్గరికి వచ్చిన వీడియోని ఇషిక అందరికి చూపిస్తుంది. గంగ నేను కాదని అంటుంది. వీడియో మొదటి నుండి చూపించగానే గంగ షాక్ అవుతుంది. ఇషిక వెళ్లి నర్స్ డ్రెస్ తీసుకొని వచ్చి చూపించగానే గంగ అడ్డంగా బుక్కవుతుంది.
ఇప్పుడేమంటావ్ గంగ అని ఇషిక అంటుంది. ఇంట్లో అందరు తలో మాట అంటుంటే.. నేను ఇదంతా రుద్ర సర్ కోసం చేసానని అంటుంది. మీ బడ్డీ చిట్టితో ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేద్దామని అలా చేసాననని రుద్రతో గంగ అంటుంది. దాంతో రుద్ర తనని కొట్టబోయి ఆగిపోతాడు. నువ్వు ఇక చెప్పకు అని చిరాకు పడతాడు. నిన్ను నమ్ముతూనే ఉంటాను. ఇంకా మోసం చేస్తూనే ఉండమని రుద్ర అంటాడు. రుద్ర కోపంగా వెళ్లిపోతుంటే.. ఇప్పుడు అర్థమైందా మోసం చేస్తే ఎలా ఉంటుందోనని శకుంతల అనగానే రుద్రకి గంగపై ఇంకా కోపం వస్తుంది. నువ్వు కరెక్ట్ చేసావ్ కావచ్చు కానీ నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది కాదని పెద్దసారు అంటాడు.
అందరు తిడుతుంటే గంగ ఏడుస్తుంది. నిన్ను అభిమానించిన వాళ్ళు అవమనిస్తుంటే ఎలా ఉంది.. బాధగా ఉంది కదా నాక్కూడా అలాగే ఉందని శకుంతల అంటుంది. తరువాయి భాగంలో గంగ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే రౌడీకి వీరు ఫోన్ చేసి.. గంగ ఇంట్లో నుండి బయటకు వస్తుంది.. పెళ్లి చేసుకుంటావో అమ్మేసుకుంటావో నీ ఇష్టమని వీరు అంటాడు. గంగ వాళ్ళింటికి వెళ్లేసరికి తాళితో రౌడి రెడీగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |